International News | బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస 20 రెట్లు ఎక్కువ
International News | బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస 20 రెట్లు ఎక్కువ
పాకిస్థాన్ తో పోల్చితే బంగ్లాదేశ్‌లో ఎక్కువ - కేంద్ర ప్రభుత్వం వెల్లడి
Hyderabad : పాకిస్థాన్‌తో పోల్చితే బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస 20 రెట్లు ఎక్కువగా నమోదైనట్లు భారత పార్లమెంట్‌లోని రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి 2,200 కేసులు, పాకిస్థాన్‌లో 112 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం హిందువులపై దాడులు మరింత పెరిగాయని తెలిపింది. హిందువులపై దాడులకు సంబంధించిన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు లేఖలు రాసినట్లు చెప్పింది. బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు హిందువులపై దాడులు మరింత పెరిగాయని తెలిపింది.
అయితే హిందువుల భద్రత, సంక్షేమం, శ్రేయస్సుకు భరోసా ఇవ్వాలని ఆయా దేశాల ప్రభుత్వాలను కేంద్ర సర్కారు కోరింది. కేంద్ర సర్కారు విడుదల చేసిన డేటా ప్రకారం.. బంగ్లాదేశ్‌లో 2022లో హిందువులపై 47 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 2023లో 302.. అలాగే, 2024లో అంటే డిసెంబర్ 8, 2024 వరకు 2,200 వరకు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపింది.
పాకిస్థాన్‌లో 2022లో హిందువులపై 241 హింసాత్మక ఘటనలు నమోదు కాగా, 2023లో 103, 2024లో అక్టోబర్ వరకు 112 సంఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మినహా ఇతర పొరుగు దేశాలలో హిందువులపై హింసాత్మక కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం చెప్పింది.
* * *
Leave A Comment